కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెకు చెందిన లింగారెడ్డి, లక్ష్మీదేవి భార్యాభర్తలు. లింగారెడ్డి గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసై డబ్బును వృథా చేసేవాడు. ఇది గమనించిన లింగారెడ్డి తల్లిదండ్రులు ఆస్తిని కోడలు పేరు మీద రాశారు. అయితే ఆస్తిని తన పేరుపై రాయాలని లింగారెడ్డి తన భార్య లక్ష్మీదేవిని వేధించటం మొదలుపెట్టాడు. ఇరువురూ తరుచుగా ఈ విషయంపై తగాదా పడేవారు. ఈ క్రమంలోనే సోమవారం గొడవ జరిగి ఆవేశం పట్టలేక లింగారెడ్డి పక్కనే ఉన్న గడ్డపారతో లక్ష్మీదేవి తలపై కొట్టాడు. తీవ్రగాయమైన లక్ష్మీదేవి రక్తం మడుగులో పడి పోయింది. భార్య చనిపోయిందని భావించి, పోలీసులు జైల్లో పెడతారని భయపడి లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీదేవిని బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి: