Hundri River Polluted : జీవనదులు కలుషితమవుతున్నాయి. లక్షలాది మంది గొంతు తడిపే నీరు గరళంగా మారుతోంది. ప్రజల ప్రాణం నిలపాల్సిన.. నీరే కాలకూట విషంగా మారుతోంది. హంద్రీ నదిలో భారీగా మురుగు చేరుతోంది. ఈ నది ప్రవాహం తుంగభద్రలో కలవడంతో.. రెండు నదులు కలుషితమవుతున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల మీదుగా హంద్రీ ప్రవహిస్తోంది.
నగరంలోని జోహరాపురం వద్ద తుంగభద్ర నదిలో ఈ నది నీరు కలుస్తుంది. నది ప్రవాహక చుట్టుపక్కల ప్రాంతాల చెత్తను వంతెనకు ఇరువైపులా వేస్తుండడంతో.. నది కలుషితం అవుతోంది. వ్యర్థాలన్నీ నది ప్రవాహ సమీపంలో వేయడంతో.. నది విస్తీర్ణం తగ్గి చిన్నపాటి వరదకే నీరు రోడ్ల పైకి వచ్చి చేరుతోంది. నగరంలోని వ్యర్థాలన్నీ నదిలో వేయడంతో డంప్‌యార్డ్‌ను తలపిస్తోంది.
కలుషిత నీరు తుంగభద్రలో కలుస్తోంది. ఈ నీటితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆనంద్‌టాకీస్, కేఈ మాదన్న నగర్, జోహరాపురం, పాతబస్తీలోని 6వ వార్డు శివారు ప్రాంతాలు ఇప్పటికే వానాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. నదిలో మురుగునీరు చేరకుండా..చెత్తాచెదారం వెయ్యకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
"ఈ మురుగు నీరు అంతా వెళ్లి తుంగభద్రలో కలుస్తుంది. చెత్తచెదరాలను తీసుకొచ్చి ఈ నదిలో పడేయడం వల్ల చిన్నగా కూరుకుపోతుంది. ఫలితంగా చిన్న వర్షం వచ్చిన రోడ్లపైకి మురుగునీరు వచ్చి చేరుతుంది. దాంతో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు స్పందించి వ్యర్థపదార్థాలను నదిలో వేయకుండా అడ్డుకుని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాం"-స్థానికులు
ఇవీ చదవండి: