ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.4.90 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 16 రోజుల్లో ఈ మొత్తం ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఈనెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగడంతో ఈ మేరకు ఆదాయం వచ్చిందని కేఎస్ రామారావు స్పష్టం చేశారు.
ఇదీచదవండి.