పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై కర్నూలు జిల్లా పోలీసులు దృష్టి సారించారు. మద్యం, డబ్బు రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 కేసులు నమోదు చేసి 16మందిని అరెస్టు చేశారు.
కర్నూల సమీపంలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో తెలంగాణకు చెందిన 2,203 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. నాటు సారా స్థావరాలపైనా దాడులు కొనసాగించారు. 305 లీటర్ల నాటు సారా, 29, 130 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేశారు.
ఇదీ చూడండి: