కర్నూలు జిల్లా ఆదోనిలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు క్యూ కట్టారు. రెండు రోజులుగా రైతు బజారులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నందున ఈ రోజు ఉదయం నుంచే జనం క్యూలైన్లలో బారులు తీరారు. పట్టణంలో మరో ఉల్లి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఉల్లి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: