కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర తండాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. స్థానిక ఆర్డీటీ కాలనీలో మోకాలు లోతు పైగా నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతంలో కాలనీని ఏర్పాటు చేయడం వల్ల నీరు బయటకు వెళ్లడానికి వీలు లేక అక్కడే నిలుస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి