భారీ వర్షాల కారణంగా... కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నంద్యాల సమీపంలో కుందూ నది, మద్దిలేరు వాగు, చామ కాలువలో నీటి ఉధృతి కొనసాగుతుంది. నంద్యాల హరిజన పేట వద్ద మద్దిలేరుపై నిర్మించిన వంతెన మునిగి పీవీ.నగర్, భీమవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హరిజనవాడలోని పలు ఇళ్ళలోకి నీరు చేరింది. పట్టణంలో చామకాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది.
ఇదీ చదవండి:
లైవ్ వీడియో: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు...వాగులో కొట్టుకుపోయిన బైక్