ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 1.88 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రవాహం పెరగడంతో జలాశయం 4 గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల గరిష్ట స్థాయికి చేరుకుంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి, స్పిల్ వే ద్వారా ద్వారా 1.42 లక్షల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు విడుదలవుతోంది.
ఇవీ చదవండి: తూర్పున తగ్గిన వరద.. తేరుకునేందుకు సమయం