ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3,22,262 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.40 అడుగుల మేర నీరుంది. గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 160.91 టీఎంసీలుగా నమోదైంది. మరో 55 టీఎంసీల నీరు వస్తే... శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది.
వరద ప్రవాహం ఇదే తీరుగా కొనసాగితే.. బుధ, గురువారాల నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని ఆనకట్ట పర్యవేక్ష ఇంజినీర్ వెంకట రమణయ్య తెలిపారు. జలాశయం నిండగానే.. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయవచ్చన్నారు.
ఇదీ చూడండి:
Earthquake: నల్లమలలో భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదు