కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వారం రోజుల నుంచి బంద్ కొనసాగించారు. హమాలీల కూలీ ధరలు పెంచాలని... వారి సమస్యలు పరిష్కరించాలని హమలీ సంఘాలు సమ్మె చేశాయి. పత్తి వ్యాపారస్తులు చర్చలకు రాకపోవడంతో పత్తి విక్రయాలు ఆగిపోయాయి. వ్యవసాయ యార్డు బోసిపోయింది. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరు వర్గాలు చర్చలు జరిపారు. హమలీ కూలి ధరలు 15శాతం పెంచుతూ ఒప్పందం చేశారు. ఈ మేరకు సమ్మెను విరమించారు. నేటి నుంచి యార్డులో పత్తి విక్రయాలు కొనసాగుతయాని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: కర్నూలులో ముస్లిం బహిరంగ సభకు హాజరైన అసదుద్దీన్ ఓవైసీ