కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, జానాలగూడెం నల్లమల అటవీప్రాంతంలో ఆవులు ఇష్టంగా మట్టిని తింటున్నాయి. ఆకలికి తట్టుకోలేకనో... లేక మరే ఇతర కారణాల వల్లో కానీ ఆవులు గుంపులుగా చేరి మట్టిని తింటున్నాయి.
- గంటల తరబడి తింటూనే..
ఈ గోవులు గంటల తరబడి మట్టిని తింటుండడం గమనార్హం. ఈ విషయంపై కొత్తపల్లి పశు వైద్యాధికారిణి భువనేశ్వరిని వివరణ కోరగా జన్యుపరమైన లక్షణాల ప్రభావం కారణంగానే కొన్ని రకాల ఆవులు మట్టిని తింటాయని వెల్లడించారు. అటవీప్రాంత రైతులు మేత కోసం ఆవులను అడవుల్లోకి గుంపులుగా పంపించడం వల్ల... ఒక్క గోవు మట్టి తింటే మిగతా గోవులన్నీ అదే పద్ధతిని అనుకరిస్తాయని ఆమె తెలిపారు. పశువులు మట్టిని తినడం వల్ల ఇతరాత్ర రోగాల బారిన పడే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని సంబంధిత పశు వైద్యులకు చూపించాలని ఆమె సూచించారు.