మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని కర్నూలు జిల్లా అటవీ అధికారి అలెన్‌చాంగ్‌తరన్ పేర్కొన్నారు. శకునాల సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్ పార్కులో గ్రీన్‌కో సంస్థ ఆధ్వర్యంలో తొలగించిన చెట్లను మళ్లీ నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పాణ్యం మండలం పిన్నాపురంలోని 900 ఎకరాల్లో గతంలో సోలార్ పార్కు ఏర్పాటుకు కొన్ని చెట్లను తొలగించాల్సి వచ్చింది.
ఈ క్రమంలో అక్కడి చెట్లను నరికివేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించి మళ్లీ నాటారు. జిల్లా అటవీశాఖ అధికారి అలెంగ్‌చాంగ్ తరన్ మాట్లాడుతూ 30 ఏళ్లు పైబడిన 250 చెట్లను సురక్షిత ప్రాంతానికి తరలించి నాటడం అభినందనీయమన్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా బయోసాయిల్ ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు ఏఎస్ నాయుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ.. మండలి ఛైర్మన్‌గా మోసేను రాజు..?