కర్నూలు జిల్లా శ్రీశైలం అడవుల్లో మరో అరుదైన పాము కనిపించింది. శ్రీశైలంలోని పాతాళగంగ మార్గం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఎల్లో గ్రీన్ క్రాట్ పామును అటవీశాఖ స్నేక్ క్యాచర్ కాళీచరణ్ పట్టుకొని సున్నిపెంట సబ్ డీఎఫ్‌వో కార్యాలయానికి తరలించారు. 1913లో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇలాంటిది చివరిసారిగా కనిపించిందని శ్రీశైలం అటవీశాఖ సబ్ డీఎఫ్‌వో చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. దీన్ని నల్లమల అడవుల్లో సురక్షితంగా వదిలిపెట్టనున్నామన్నారు.
ఇదీ చూడండి: Water boards: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నేటినుంచే కీలక సమావేశాలు.. ఏం జరగనుంది?