ETV Bharat / state

విధులకు సరిగా హాజరు కావడం లేదంటూ వీఆర్వోకు మెమో.. రెవెన్యూ ఉద్యోగుల నిరసన

కర్నూలు జిల్లా బసవపురం వీఆర్వోకు.. గ్రామ పంచాయతీ కార్యదర్శి మెమో ఇవ్వడంపై రెవెన్యూ ఉద్యోగల సంఘం నిరసన వ్యక్తం చేసింది.

Gram Panchayat Secretary issues memo to vro at basavapuram
వీఆర్వోకి గ్రామపంచాయతీ కార్యదర్శి మెమో జారీ
author img

By

Published : Mar 17, 2021, 8:56 AM IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసవపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రెవెన్యూ అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది. బసవపురం వీఆర్వో గ్రీష్మపై.. విధులకు సరిగా హాజరు కావడం లేదని, హాజరు వేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా.. ఆమెకు గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకళ.. మెమో జారీ చేశారు.

ఈ పరిణామంపై.. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆందోళన చేసింది. ధర్నా చేపట్టింది. ఏ అర్హతతో గ్రామ పంచాయతీ కార్యదర్శి మెమో జారీ చేశారని ప్రశ్నించారు. వెంటనే సదరు మెమోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాంరెడ్చి చెప్పారు.

ఇదీ చూడండి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.