ETV Bharat / state

కర్నూలులో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి - మంగళగిరి లెటెస్ట్ న్యూస్

Govt gives permision to ap judicial academy:ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖను మరింత విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. దానికి సంకేతంగా రాష్ట్రంలో న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ఏర్పాటు చేయనుంది. శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో,తాత్కాలిక ప్రాతిపదికన మంగళగిరిలో న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి న్యాయ శాఖ కార్యదర్శి జి. సత్యప్రభాకర్ రావు ఈనెల 19 న జీవో జారీచేశారు.

ఏపీ హై కోర్టు
AP HIGH COURT
author img

By

Published : Oct 21, 2022, 11:24 AM IST

Govt gives permision to ap judicial academy: ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖను మరింత విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. దానికి సంకేతంగా న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం ఏపీలో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో, తాత్కాలిక ప్రాతిపదికన మంగళగిరిలోని ఓ అద్దె భవనంలో న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్, ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్​లను కోరింది. న్యాయ శాఖ కార్యదర్శి జి. సత్యప్రభాకర్​రావు దీనికి సంబంధించి ఈనెల 19 న జీవో జారీచేశారు.

ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు కోసం హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ ( ఐటీ - సీపీసీ ) ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్ 2019 ఆగస్టు 16 , 2020 అక్టోబర్ 1 న లేఖలు పంపారు. ప్రభుత్వం ఈనెల 19 న జీవో నం 152 జారీ చేస్తూ శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

ఇవీ చదవండి:

ఇసుక దందాను కొత్త పుంతలు తొక్కిస్తున్న వైకాపా ప్రభుత్వం... పరాకాష్ఠకు దోపిడీ

Visakha land Scam: విశాఖలో ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను...

ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.