కర్నూలు జిల్లా బనగానిపల్లి మండలం యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆలయ ప్రధానార్చకులుగా కె.యూ.ఎస్.డి శర్మ, ఎక్స్ అఫీషియో కన్వీనర్‌గా పేర్కొంటూ పది మంది సభ్యులను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించింది. వారు రెండేళ్లపాటు పాలకమండలి సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: వారసత్వ భూమి కోసం.. ఇంటి వద్ద కుటుంబ సమేతంగా రైతు దీక్ష!