కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మఠం నుంచి తుంగభద్ర నది వరకు పల్లకి ఊరేగింపు సాగింది. ప్రహ్లాదరాయులను తెప్పలో కూర్చోబెట్టి మంగళ హారతి ఇచ్చారు. భక్తుల జయ జయ ధ్వనుల మధ్య తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఇదీ చదవండి: