ప్రియుడు మోసం చేశాడంటూ. ఓ యువతి అతని ఇంటిముందు ఆందోళన చేసింది. కర్నూలు జిల్లా నందవరానికి చెందిన డిగ్రీ విద్యార్థి రాకేష్‌కు హైదరాబాద్‌కు చెందిన అనూష ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. మూడు నెలలు పరిచయం ప్రేమగా మారి హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో జూలై 4న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాలుగు రోజులు గడిచాక రాకేష్ నందవరానికి వెళ్లాడు. ప్రియుడు హైదరాబాద్ నుంచి తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన అనూష... నందవరంలోని రాకేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. విషయం తెలుసుకున్న నందవరం పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి.
ప్రతిరోజు 50వేలకుపైగా పరీక్షలు చేస్తున్నాం: అంజాద్ బాషా