కర్నూలు జిల్లా నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిపాటి గడ్డకు చెందిన అక్బర్, ముల్లాన్ పేటకు చెందిన రహంతుల్లా, నడిగడ్డకు చెందిన మున్నాలు ఇళ్లలో గ్రానైట్ రాయి అలంకరణ చేసే పనితో కుటుంబాలను పోషించుకునే వారు. మద్యానికి బానిసైన వీరు..అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని గత కొంత కాలంగా దోపిడీలకు పాల్పడుతున్నారు.
గత నెల నంద్యాల సమీపంలోని ఆటో నగర్, రైతునగర్ వద్ద ఓ లారీ డ్రైవర్ను, బొలెరో వాహన డ్రైవర్ను కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రెండు చరవాణులు, రూ.4,500 నగదును దోచుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఒకడైన అక్బర్ గంతలోనే ఓ హత్య కేసు, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడంచారు.
ఇదీచదవండి