కర్నూలు జిల్లా మాధవరం గ్రామంలో ప్రస్తుత కర్నూలు కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌గా ఎదిగిన ఎన్.రామిరెడ్డి కుటుంబీకులు 17 ఏళ్లుగా రాజకీయాల్లో ముందుంటున్నారు. ప్రస్తుతం కేడీసీసీ ఛైర్మన్‌గా ఎన్.రామిరెడ్డి బాధ్యతలు వహిస్తున్నారు. 1995, 2002లో రెండుమార్లు ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు కుటుంబంలో నలుగురు సర్పంచులుగా పని చేశారు.
రామిరెడ్డి భార్య ఎన్.లక్ష్మమ్మ(లేట్) 2006-13 సంవత్సరాల మధ్య సర్పంచిగా పనిచేశారు. ఆయన పెద్దకుమారుడు ఎన్.రాఘవేంద్రరెడ్డి(1994-2001)లోనూ, పెద్ద కోడలు ఎన్.యశోదమ్మ(2002-06) మధ్య, రెండో కుమారుడు రఘునాథ్‌ె రడ్డి(2014-21)లలో సర్పంచులుగా పనిచేశారు. యశోదమ్మ 2007-12లో జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇలా కుటుంబమంతా ప్రజల నమ్మకం సంపాదించి.. ఊరిని అభివృద్ధి పథం వైపు నడుపుతున్నారు.
ఇదీ చదవండి: