ETV Bharat / state

దసరాకు కర్నూలు నుంచి విమానాలు!

కర్నూలు విమానాశ్రయం నుంచి దసరాకు విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు కేంద్ర పౌర విమానయాన సంస్థ అనుమతుల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాన్ని ఏపీ ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేయనుంది. దీనిపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Flights from Kurnool to Dasara
Flights from Kurnool to Dasara
author img

By

Published : Oct 10, 2020, 9:24 AM IST

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వచ్చేనెల నుంచి ప్రారంభించనున్నారు. సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఉడాన్‌ పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు సర్వీసులు నడపడానికి ట్రూజెట్‌ సంస్థ సిద్ధంగా ఉంది. నిర్మాణ పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు భరత్‌రెడ్డి తెలిపారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ఏపీలో తొలి పైలట్‌ శిక్షణ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చాయని, ఫైనాన్షియల్‌ బిడ్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కర్నూలు విమానాశ్రయ భూములను వినియోగించుకున్నందుకు ఏపీఏడీసీఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.