కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఓ ఇంట్లో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. గ్రామానికి చెందిన మౌలాలి కుటుంబ సభ్యులు కూలీ నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో గ్యాస్ లీకై ఇంటి నిండా వ్యాపించింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు.. లైట్ వేయగానే మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మౌలాలి అతని భార్య శోభ, కుమారుడు అరవింద్‌కు గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయని మౌలాలి బంధువులు తెలిపారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: