రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తున్న తుంగభద్ర నది పుష్కరాలు నేటితో ముగిశాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుమారు 230 కోట్ల వ్యయంతో... 23 ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... సంకల్ బాగ్ ఘాట్లో ప్రత్యేక పూజలు చేసి, పుష్కరాలను ప్రారంభించారు.
కరోనా, నివర్ తుపాన్ ప్రభావంతో జిల్లాలోని ఘాట్లు భక్తులు లేక వెలవెలబోయాయి. సెలవుదినాలు, ప్రత్యేక దినాల్లో మాత్రమే... మంత్రాలయం, సంకల్ బాగ్ ఘాట్లలో భక్తుల తాకిడి కనిపించింది. పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న 10 మంది పోలీసులు, ముగ్గురు భక్తులు, ఒక పూజారికి కరోనా నిర్ధరణ కావటం ఆందోళన కలిగించింది.
సంకల్ బాగ్ ఘాట్లో... రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, తుంగభద్రకు ప్రత్యేక హారతులు, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఆది పుష్కరాలను విజయవంతం చేసినందుకు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ వీరపాండియన్ ప్రశంసించారు. పుష్కర ఘాట్లను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.