కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో.. తెదేపా - వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పింఛన్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఎంపీడీవో గౌరీదేవి.. పంచాయితీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. భర్త బతికుండగానే వితంతు పింఛన్, చేపలు పట్టకుండానే ఇద్దరికి మత్స్యకార పింఛన్ ఎలా పంపిణి చేస్తారని గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న వైకాపా శ్రేణులకు... తెదేపా శ్రేణులకు వాగ్వాదం జరిగింది. తమ నేత గోవిందుపై వైకాపా నేతలు దాడికి దిగారని తెదేపా నేతలు ఆగ్రహించారు. ఇరు వర్గాల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: