పొలానికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ ఓ రైతు కుటుంబం.. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారసత్వం కింద వస్తున్న 8 ఎకరాల భూమికి పాస్ పుస్తకం అడుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని పరమాన్ దొడ్డి తాండాకు చెందిన బాలనాయక్ వాపోయాడు. ఎమ్మెర్వో సైతం విచారణ జరిపినప్పటికీ.. ఇవాళ, రేపు అంటూ ఎనిమిదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి