కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వర్షాభావం వల్ల సాగుకు నోచుకోక తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్ శివ శంకర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి కశ్మీర్: 370, 35ఏ అధికరణలు రద్దు!