గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలని మాజీ మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. గృహాలను పేదలకు అప్పగించాలంటూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి రంగులు వేయటం, తీయటం తప్ప ఏమీ చేతకాదని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు. గృహాలకు సంబంధించిన రూ.1500 కోట్ల బకాయిలను ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రచారాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు మేలు చేసే విషయంలో ముందుకు రావటం లేదని విమర్శించారు.
ఇదీచదవండి