కర్నూలు జిల్లా అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామికి సేవ చేసే సేవకులకు అహోబిలం దేవస్థానం వారు చేయూత అందించారు. స్వామివారి పల్లకి మోసే బోయిలు, పర్యాటకులకు తోడ్పడే గైడ్లకు దేవస్థానం వారు నిత్యావసర వస్తువులు అందించారు. లాక్డౌన్ కారణంగా ఆలయాలు మూతపడటంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సేవకులకు దేవస్థానం సభ్యులు లక్ష రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేశారు. స్వామి వారి ఆశీస్సులతో త్వరలోనే లోకం సుభిక్షంగా ఉంటుందని అర్చకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఆలయంలో హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'నంద్యాలను మరో కర్నూలు చేయొద్దు'