కర్నూలు జిల్లా నంద్యాలలో భారతీయ వైద్యుల సంఘం జాతీయ సంస్కృతిక కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో వైద్య రక్షణ చట్టాన్ని భారతీయ శిక్షాస్మృతిలోకి చేర్చాలని అన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఐఎంఎ ఆధ్వర్యంలో ఈ నెల 16న సామాజిక మాధ్యమాల్లో అవగాహన, 17న ప్రజాప్రతినిధులకు వినతిపత్రం సమర్పణ కార్యాక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు...డాక్టర్ మధుసూదన్‌రావు, అనిల్ కుమార్, విజయభాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Viveka Murder Case: తన ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచండి: వివేకా కుమార్తె సునీత