కర్నూలు జిల్లా ఆస్పరి మండలం యాటకల్లు పంచాయతీ మజ్రా గ్రామం కలపరి ప్రాథమిక పాఠశాల పాడుబడ్డ బంగ్లాను తలపిస్తుంది. ఈ బడిలో రెండు గదులే ఉన్నాయి. అవీ శిథిలావస్థకు చేరుకోవడంతో ‘నాడు-నేడు’లో పనులు చేయాలని గత జూన్‌లో ఓ గది పైకప్పును గుత్తేదారులు తొలగించారు. నిధులు రాక.. అలాగే వదిలేశారు. మిగిలిన ఒక్క గదిలోనే విద్యార్థులంతా చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ గదిలోనూ పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఎండవేళ పైకప్పు లేని వరండాలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: ఇరుకు గదుల్లో చదువులు సాగేదెలా!