ETV Bharat / state

రూ. కోటి విలువ చేసే వజ్రాలు చోరీ.. ఎక్కడంటే..!!

Diamonds theft in Banjara Hills: హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో కోటి రూపాయలు విలువ చేసే వజ్రాలు, బంగారం ముడి సరుకు చోరీకి గురైంది. బంగారు ఆభరణాలు తయారుచేసే పవన్​కుమార్​ మంగళవారం గుజరాత్​ నుంచి వజ్రాలు, బంగారం ముడి సరుకు తీసుకొచ్చి షాపులో భద్రపరచగా.. బుధవారం వచ్చి చూసేసరికి లాకర్​తో సహా వజ్రాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వజ్రాలు
diamonds
author img

By

Published : Dec 22, 2022, 4:36 PM IST

Diamonds theft in Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కోటి రుపాయలు విలువచేసే వజ్రాలు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బంగారు ఆభరణాల వ్యాపారం చేసే పవన్‌కుమార్‌ డైమండ్‌ నెక్లెస్‌ ఆర్డర్‌ నిమిత్తం గుజరాత్​లోని సూరత్​ నుంచి వజ్రాలు, బంగారం ముడిసరుకు తెప్పించారు. మంగళవారం రోజున తన షాప్‌లోని లాకర్‌లో వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు.

బుధవారం ఉదయం వెళ్లి దుకాణాన్ని తెరవగా లాకర్‌తో సహా వజ్రాలు చోరీకి గురైనట్లు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన వజ్రాల విలువ కోటి రూపాయలు ఉంటుందని పవన్ ​కుమార్ అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.