హాథ్రస్ అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐవైఎఫ్, దళిత హక్కుల పోరాట సమితి సంయుక్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: