DEMOLISH: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బస్‌షెల్టర్ కూల్చివేత వివాదానికి దారి తీసింది.రహదారి విస్తరణలో భాగంగా... అడ్డంగా ఉన్న నిర్మాణాలను పురపాలక అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా... మాజీ ఎంపీ దివంగత భూమా నాగిరెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన బస్సు షెల్టర్ కూల్చివేతకు సిద్ధమయ్యారు. సమాచారం ఇవ్వకుండా తమ తండ్రి పేరిట ఉన్న నిర్మాణాన్ని కూల్చివేస్తారా అంటూ భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు. ఇదే సమయంలో వైకాపా నాయకులు కూడా కార్యకర్తలతో కలిసి రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ]
విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి విఖ్యాత్ రెడ్డితో మాట్లాడి కూల్చివేత ఆపుతామని నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆయన వెళ్లిన తర్వాత అధికారులు మళ్లీ కూల్చివేత ప్రారంభించించారు. మరోసారి విఖ్యాత రెడ్డి అక్కడికి చేరుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేత ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: