
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం ఆనకట్ట మరమ్మతులకు... ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు ఏర్పడ్డాయని, ప్రమాదం పొంచి ఉందని వాటర్‌మెన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ చెప్పిన విషయం గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆనకట్టకు మరమ్మతులు చేపట్టాలని రామకృష్ణ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా... శ్రీశైలం ఆనకట్టకు వచ్చిన ప్రమాదమేమి లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనాలు