ETV Bharat / state

సంజీవని బస్సులో కిట్ల కొరత.. పరీక్షల కోసం జనం పడిగాపులు - నంద్యాలలో కరోనా కేసులు

రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరీక్షలు చేయించుకునే వారు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో గంటల తరబడి కరోనా పరీక్షల కోసం పడిగాపులు కాస్తున్నారు.

corona test
corona test
author img

By

Published : Jul 22, 2020, 7:57 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పరీక్షల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కరోనా పరీక్షల నిమిత్తం ప్రభుత్వం సంజీవని బస్సులను ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం నంద్యాలలో ప్రారంభమైన ఈ బస్సును స్థానిక టౌన్ హాలు ఆవరణలో అందుబాటులో ఉంచారు. ఇది తెలుసుకున్న ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా.. పరీక్షలకు కొందరు నోచుకోల్లేదు. కంప్యూటర్​లో పేర్లను పొందుపరిచే సిబ్బంది లేకపోవడం.. కిట్స్ లేకపోవడం తదితర కారణంగా పరీక్షలు జరగట్లేదు. ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని.. ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.