ETV Bharat / state

కరోనాతో ప్రశ్నార్థకంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల భవిష్యత్తు

విద్యార్థి భవిష్యత్తును మార్చేవాడే ఉపాధ్యాయుడు. కానీ కరోనాతో ఆ ఉపాధ్యాయుడి భవిష్యత్తే అంధకారంలో మగ్గుతోంది. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడడంతో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. వేతనాలు రాక.. బతికేందుకు అవకాశం లేక.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారు.

private teachers problems
ప్రైవేట్ ఉపాధ్యాయులపై కరోనా ప్రభావం
author img

By

Published : Jun 10, 2021, 6:40 PM IST

ప్రైవేట్ ఉపాధ్యాయులపై కరోనా ప్రభావం

కరోనా కాటుకు ప్రైవేటు ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. మొదటి దశ కరోనా కారణంగా.. దాదాపు ఆరు నెలలు పాఠశాలలు తెరుచుకోలేదు. అప్పట్లో.. వేతనాలు రాక, బతుకు భారమై పలువురు ఉపాధ్యాయులు.. ఇతరత్రా పనులు చేసి పొట్టనింపుకున్నారు. కానీ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టాక పాఠశాలలు తెరిచారు. పరిస్థితులు చక్కబడుతున్నాయన్న తరుణంలోనే కరోనా రెండో దశ విరుచుకుపడింది. దీంతో పాఠశాలలు మళ్లీ మూతపడ్డాయి. జీతాలు ఆగిపోయాయి. ఇంతకముందు చేపట్టిన పనులు సైతం నిలిచిపోయాయి.

పలువురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ఆస్పత్రుల్లో లక్షలు పోసి ప్రాణాలు కాపాడుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో.. పూట గడవడం కూడా కష్టంగా మారిందని ప్రైవేట్‌ ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ప్రభుత్వం ప్రైవేటు టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు జస్టిస్‌ కాంతారావు ఆధ్వర్యంలో కమిషన్‌ను వేసింది. కానీ ఇంతవరకు ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించలేదని.. ఉపాధ్యాయులు అంటున్నారు. తెలంగాణలో లాగా ఏపీలోనూ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మూడో దశ కరోనా చిన్నారులైప ప్రభావం చూపిస్తున్నందని హెచ్చరికల దృష్ట్యా ప్రైవేట్‌ పాఠశాలలకు ఎప్పుడు పూర్వ వైభవం వస్తుందో అని.. ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వారసత్వ భూమి కోసం రైతు పోరాటం.. 5వ రోజు కొనసాగుతున్న దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.