కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో 2500 కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 మంది మృతిచెందారు.
* పురపాలక సంఘం కమిషనర్‌తోపాటు కార్యాలయంలో మరో 10 మందికి వైరస్ సోకింది. వారు క్వారంటైన్లో ఉన్నారు.
* నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పలువురు శాస్త్రవేత్తలకు, బోధనేతర సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. కరోనాతో టైం స్కేల్ కూలీగా పనిచేసే ఒకరు మృతిచెందారు.
* రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు కొవిడ్ బారిన పడి, క్వారంటైన్లో ఉంటున్నారు.
* ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకూ వైరస్ సోకింది. పలువురు వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావటంతో నంద్యాలలో ఆగస్టు 1 నుంచి దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి...