కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం జిల్లాలో కొత్తగా 53 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. మొత్తం 1,654 మందికి పరీక్షలు నిర్వహించారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 16, ఆదోనిలో 14, నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 8, దేవనకొండలో 2, నందవరంలో 2, పత్తికొండలో 4, కర్నూలు రూరల్, ఎమ్మిగనూరు రూరల్, డోన్, కోడుమూరు, మద్దికేర, మంత్రాలయం, ఎమ్మిగనూరులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. జిల్లాలో ఏడుగురు కరోనా బారి నుంచి కోలుకొన్న తర్వాత మళ్లీ వైరస్ సోకింది. 592 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కర్నూలులో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 53 మందికి పాజిటివ్..!
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతునే ఉంది. మంగళవారం జిల్లాలో 1,654 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 53 మందికి పాజిటివ్‌గా తేలింది.