విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అధికార వైకాపా కలిసిరావాలని.. తెదేపా నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు కర్నూలు గాయత్రీ ఎస్టేట్లో నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అన్ని పార్టీలు ఐకమత్యంతో.. ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెదేపా కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న పరిశ్రమను.. ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: