ఈటీవీ భారత్లో ప్రసారమైన కుమార్తెకు తల్లి వాతలు పెట్టిన వార్తకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. అవుకు గ్రామానికి చెందిన చిన్నారి బిందుభార్గవి ఎంత పిలిచినా ఇంటికి రావడం లేదంటూ తల్లి వాతలు పెట్టింది... ఈ ఘటనపై జిల్లా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం (ఐసీపీఎస్) ఏపీడీ విజయను విచారణాధికారిగా నియమించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: వాతలు పెట్టిందని కోడలిపై అత్త కేసు...!