కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నెల్లిబండ, మాచాపురం గ్రామ సచివాలయాల్లో విధులకు గైర్హాజరైన 16 మంది ఉద్యోగులను జిల్లా కలెక్టర్
జి.వీరపాండియన్ సస్పెండ్ చేశారు. రెండు సచివాలయాల్లో ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లను పరిశీలించారు.
కొంతమంది ఉద్యోగులు విధుల్లో లేకపోవడాన్ని గుర్తించి వివరాలు సేకరించారు. అనంతరం మాచాపురం సచివాలయంలో 9 మంది, నెల్లిబండ సచివాలయంలో ఏడుగురు ఉద్యోగులపై వేటు వేశారు.
ఇదీ చదవండి