తెదేపా నేత తిక్కారెడ్డికి చంద్రబాబు పరామర్శ - కర్నూలు జిల్లా
మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిని ఎమ్మిగనూరులోని సాయిరాం ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు పరామర్శించారు.
తిక్కారెడ్డిని పరామర్శించిన చంద్రబాబు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోనిసాయిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమంత్రాలయం తెదేపా అభ్యర్ధి తిక్కారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ నెల 16న మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో జరిగిన కాల్పుల్లో తిక్కారెడ్డి గాయపడిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఎమ్మిగనూరుకు వచ్చిన చంద్రబాబు తిక్కారెడ్డిని పరామర్శించటానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్ధి బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
రిపోర్టర్: జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం..
జిల్లా: పశ్చిమ గోదావరి
ఫైళ్లు :Ap_tpg_42_27_bvm_raghuramakrishnamraju_nagababu_g6
Ap_tpg_43_27_bvm_raghuramakrishnamraju_nagababu_g6
మొబైల్ :9849959923
యాంకర్ :జనసేన అధినేత పవన్ కల్యాణ్ అతని సోదరుడైన నాగబాబుపై వైకాపా నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శించారు .
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఓటమి భయంతోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.
సొంత ఊర్లో లైబ్రరీ పెట్టుకుంటాం అంటే ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకొని అమ్ముకున్న వ్యక్తి నాగబాబు, ఆయన గురించి పగో జిల్లాలో ఎవరికైనా తెలుసు, ఎన్నికల కోసమే మళ్లీ వచ్చారని కూడా ప్రజలకు తెలుసన్నారు .ప్రభుత్వాల నుంచి నాకే 900 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు .
విగ్గుల గురించా మీరు మాట్లాడేది ? ప్రజా సమస్యలు అంటే ఇవా..? ప్రజలకు ఏం చేస్తారో నాగబాబు చెప్పాలన్నారు .నేను పార్టీలు మారడం కాదు నా సొంత గూటికి తిరిగొచ్చాను, నేను ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒక్కటే కండువా వేసుకున్నా , కానీ మీరు ఏడు కండువాలు ఒకేసారి వేసుకొని తిరుగుతున్నారు .సీపీఎం, సీపీఐ ,ఏనుగు, నడుముకు పచ్చ కండువా చివరికి పాల్ కండువా ఇలా ఏడు వేసుకున్నారు. మీ అన్న చిరంజీవి మీ తమ్ముడు పవన్ లకు గౌరవం ఉంది మీ తీరు వల్ల వారిద్దరి పరువు పోతుందని విమర్శించారు .మీరు సినిమాల్లో చేస్తారు, త్వరలోనే పశ్చిమగోదావరి జిల్లాలో మేము మీకు సినిమా చూపిస్తాం .వాపును చూసి బలుపు అనుకోవద్దు, ఏప్రిల్ 11 వరకూ వెయిట్ చేయండి. ఇంత లావుగా ఉంటే తంతాం అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వారు భయపడే వారు ఎవరూ లేరు.ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు, రండి ఛాలెంజ్ నన్ను తంతావో లేదో చూద్దాం రండి . మీరు మీ తమ్ముడు కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు, రెండు రాష్ట్రాల మధ్య శాంతి చెడగొట్టవద్దు .మీరు ప్రశాంతంగా మీ ప్రచారం చేసుకోండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రశాంతమైన జిల్లాలో శాంతిగా ఉండండి.. ఎన్నికల రోజు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలిసిపోతుంది.. ప్రజాతీర్పు చూడండి .
ప్రజలు వైఎస్ జగన్ నాయకత్వం కోరుకుంటున్నారు, మా వైపే ఉంటారు..
బైట్ :కనుమూరి రఘురామకృష్ణంరాజు ,వైకాపా నరసాపురం ఎంపీ అభ్యర్థి