ETV Bharat / state

అనాలోచిత ఖర్చులతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం: చంద్రబాబు - Kurnool district latest news

ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత ఖర్చుల కారణంగా రాష్ట్ర ఆర్థిక స్థితిపై పెనుభారం పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తెదేపాపై ప్రతీకారేచ్ఛతో ప్రజల మీద కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రచారంలో గొప్ప, పరిపాలనలో సున్నాగా వైకాపా పాలన ఉందని వ్యాఖ్యానించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Oct 28, 2020, 11:54 PM IST

వైకాపా ప్రభుత్వం అనాలోచిత ఖర్చులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏడాదిన్నర లోపే ప్రజలపై 60 వేల కోట్ల రూపాయలు భారం వేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. తెదేపాపై ప్రతీకారేచ్ఛతో ప్రజల మీద కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు... వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెదేపా ప్రభుత్వం కర్నూలు అభివృద్దికి ఎనలేని కృషి చేసింది. వైకాపా పాలనలో కర్నూలు జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యం. రైతులు, మహిళలు, దళితులు, యువత, ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సీఎం జగన్ అనాలోచిత ఖర్చుల కారణంగా రాష్ట్ర ఆర్థిక స్థితిపై పెను భారం పడుతోంది.పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయి. కరోనా కంటే ఈ ప్రభుత్వ మూర్ఖపు ధోరణి రాష్ట్ర ప్రజలను పొట్టన పెట్టుకుంది. ప్రచారంలో గొప్ప, పరిపాలనలో సున్నాగా వైకాపా పాలన ఉంది. వరద సహాయ, పునరావాస చర్యల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది- చంద్రబాబు, తెదేపా అధినేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.