కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా సంప్రదాయబద్ధంగా జరిగే పుట్టినరోజు వేడుకల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యక అలంకారం... ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ రవి కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ వీడియో లవర్స్‌కు ఈ డేటా ప్లాన్లు బెస్ట్!