కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్రిణిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడి మృతి చెందింది. వెంకట హారిక ఈ రోజు ఉదయం ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారి పడిపోవటాన్ని తండ్రి కేశాలు, తల్లి ధనలక్ష్మి గమనించలేదు.
కాసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో గాలించగా నీటి తొట్టెలో నిర్జీవంగా కనిపించింది. చిన్నారి విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నిండాయి.
ఇదీ చదవండి: కూల్‌డ్రింక్‌లో చీమల మందు కలుపుకొని తాగిన చిన్నారులు..బాలుడు మృతి