కరోనా బాధితులు, అనుమానితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాలను (సీసీసీ) ఎత్తివేయనున్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తొలగించేలా చర్యలకు ఉపక్రమించారు. జిల్లా మొత్తానికి జేఎన్‌టీయూ ఎల్లోరా వసతి గృహాన్ని మాత్రమే ఉంచనున్నారు. ఇక్కడ 330 పడకల సామర్థ్యం ఉంది. నవంబరు మొదటి వారం నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉండటం వల్ల సీసీసీలను ఎత్తివేయాలని నిర్ణయించారు. అందులోనూ ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.
అనంతపురం జిల్లాలో కొవిడ్ కేర్ కేంద్రాల ఎత్తివేత!
అనంతపురంలో కరోనా బాధితులు, అనుమానితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాలను (సీసీసీ) ఎత్తివేయనున్నారు. జిల్లా మొత్తానికి జేఎన్‌టీయూ ఎల్లోరా వసతి గృహాన్ని మాత్రమే ఉంచనున్నట్లు సమాచారం.
అనంతపురం జిల్లాలో కొవిడ్ కేర్ కేంద్రాల ఎత్తివేత!
కరోనా బాధితులు, అనుమానితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాలను (సీసీసీ) ఎత్తివేయనున్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తొలగించేలా చర్యలకు ఉపక్రమించారు. జిల్లా మొత్తానికి జేఎన్‌టీయూ ఎల్లోరా వసతి గృహాన్ని మాత్రమే ఉంచనున్నారు. ఇక్కడ 330 పడకల సామర్థ్యం ఉంది. నవంబరు మొదటి వారం నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉండటం వల్ల సీసీసీలను ఎత్తివేయాలని నిర్ణయించారు. అందులోనూ ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.
240 మంది చికిత్స
జిల్లాలోని 12 కొవిడ్ ఆస్పత్రుల్లో 772 మంది వైద్య చికిత్స పొందుతున్నారు. ఎనిమిది సీసీసీ కేంద్రాల్లో 240 మంది ఉన్నారు. వీరందరినీ ఒకే చోటుకు చేర్చనున్నారు. తొలుత 17 సీసీసీ కేంద్రాలు ఉండగా.. క్రమేణా 12కు తగ్గాయి. ఇప్పుడు ఎనిమిదే ఉన్నాయి. వీటిలో ఎస్కేయూ, జేఎన్‌టీయూ, లేపాక్షి బాలయోగి, ధర్మవరం, కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఆదర్శ పాఠశాలలు, పుట్టపర్తి ధర్మశాలలో కేంద్రాలు ఉన్నాయి. జేఎన్‌టీయూ మినహా.. మిగిలిన సీసీసీలను ఎత్తివేయనున్నారు.
233 మందికి కరోనా
జిల్లా వ్యాప్తంగా మరో 233 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన మూడు మాసాల్లో సున్నా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ వివరాలను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 1932 మంది వైద్య చికిత్స పొందుతున్నారు. మొత్తం 533 మంది చనిపోయారు. 59610 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
ఇదీ చూడండి: