వైకాపా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలు అమలు చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలు నిర్వహించిన 'మన పాలన-మీ సూచన' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను వివరించి ఏమైనా సలహలు, సూచనలు ఉంటే చెప్పాలని కోరారు.
గ్రామ సచివాలయల ఉద్యోగులు స్థానికంగా ఉండాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంలో వేల కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు బుగ్గన తెలిపారు.