కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందూ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. గతంలో ఈ సమస్యపై స్పందించిన తెదేపా ప్రభుత్వం.. కొత్త వంతెన నిర్మాణం చేసేందుకు 2017 జూలైలో.. 733.40 లక్షల అంచనాతో పనులు ప్రారంభించారు. వంతెన నిర్మాణ పనులు స్తంభాల ఏర్పాటు జరిగిన తరువాత ఎన్నికలు రావటం.. ఎన్నికల కోడ్‌తో పనులు ఆగిపోవటం.. అనంతరం ప్రభుత్వం మారటంతో... నిర్మాణ పనులు అర్థంతరంగా ఆగిపోయాయి.
నంద్యాల నుంచి నందమూరి నగర్, వైయస్సార్ నగర్, పురిమద్ది, రాయమలుపురం, మునగాల గ్రామాలతో పాటు గడివేముల మండల ప్రజలు.. పాత వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు భారీగా రావటం.. పైగా వంతెన శిథిలావస్థకు చేరుకోవటంతో.. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి.. కొత్త వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: