ETV Bharat / state

చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రి బాగోగులు - కర్నూలులో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తండ్రిని పోషిస్తున్న బాలుడు న్యూస్

అమ్మ లేదు... అయ్యకు అనారోగ్యం. భుజాన బ్యాగ్‌ వేసుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో.. అదే భుజాలపై తండ్రి బాధ్యత తీసుకుని.. నాన్నకే నాన్నయ్యాడు. చిరునవ్వులతో గడపాల్సిన బాల్యంలో.. చిత్తు కాగితాలు ఏరుకుంటూ తండ్రి బాగోగులు చూసుకుంటున్నాడు.

చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రిని చూసుకుంటున్నాడు

author img

By

Published : May 22, 2021, 4:53 PM IST

చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రిని చూసుకుంటున్నాడు

వయసుకు మించిన బరువు బాధ్యతలను తలకెత్తుకున్నాడు బాలుడు శ్యాంసుందర్‌. కర్నూలు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో తన విషాదగాథ బయటపడింది. ఒక మాఫియా వల్ల కార్మికులుగా మారే బాలల కథలు సహజం. తండ్రి ఆలనాపాలనా చూసుకునేందుకు స్వతహాగా కార్మికుడిగా మారాడు.. శ్యాంసుందర్.

నిరుపేదలైన బీసన్న, లక్ష్మీకి ఇద్దరు సంతానం. ఏడాది క్రితం లక్ష్మీ చనిపోయింది. బోద కాలు బారిన పడటంతో బీసన్న ఉపాధి కోల్పోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేక అద్దె ఇంటిని ఖాళీ చేసి రోడ్డునే ఆవాసంగా మార్చుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వంతెనపైనే వారి జీవనం. దురలవాట్లకు బానిసైన పెద్దకొడుకు.. బాధ్యతారాహిత్యంగా మారాడు. రోజూ పొట్ట నింపుకొనేందుకు.. చిన్నకొడుకు శ్యాంసుందర్ చిత్తు కాగితాలు ఏరడం మొదలుపెట్టాడు. వచ్చే డబ్బుతో ఆకలి తీర్చుకోవడమే కాక తండ్రికి వైద్యమూ చేయిస్తున్నాడు.

విచారణ వేళ శ్యాంసుందర్‌ చెప్పిన మాటలు.. ఎంతో కలచివేశాయని సీఐ పార్ధసారథిరెడ్డి అన్నారు. చిన్నతనంలోనే పెద్ద బాధ్యతను తలకెత్తుకున్న శ్యాంసుందర్‌ను చూసి అందరూ జాలి పడుతున్నారు.

ఇదీ చదవండి: సోనూసూద్ ఆక్సిజన్​ ప్లాంట్లు.. ఆంధ్రా​ నుంచే శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.