కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని పీ. చింతకుంటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బాషా ఈత కొట్టడం కోసం సమీపంలోని చెరువుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో ఆయాసం వచ్చి నీటిలో మునిగిపోయాడు. అతని స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
వారు వెళ్లి గ్రామస్థులకు సమాచారమివ్వగా.. పోలీసులకు గాలింపు చేపట్టి 3 గంటల తర్వాత మృతదేహాన్ని వెలికితీయించారు. బాషా మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: